

మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, కోదండరాం తెలంగాణలో శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప చైర్మన్ బండా ప్రకాష్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
శాసనమండలిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అజారుద్దీన్ తన ఎమ్మెల్సీ నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీతో పాటు తన సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసం మరింత కష్టపడి పని చేస్తానని, మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.









.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!