

బీహార్ రాజకీయం ఊపందుకున్న వేళ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అంచనా నిజమవుతోంది. ఎన్డీటీవీ నిర్వహించిన బీహార్ పవర్ ప్లే సమ్మిట్లో ఆయన—ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ భూకంపం సృష్టిస్తుందని ముందుగానే చెప్పారు. ప్రస్తుతం వస్తున్న లెక్కలు ఆయన మాటలను సాక్ష్యంగా నిలబెడుతున్నాయి.
ఓట్ల లెక్కింపు ప్రారంభమై మూడు గంటలు గడిచే సమయానికి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) 180కి పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఉదయం 11.30 వరకు వచ్చిన సమాచారం ప్రకారం, ఎన్డీయే 187 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మహాగఠ్బంధన్ కేవలం 49 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఈ పెరుగుతున్న ఆధిక్యం కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతోంది.
అమిత్ షా ఇప్పటికే పలుమార్లు - ఎన్డీయే ఈసారి 160కు పైగా సీట్లు గెలుస్తుందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టంగా చెప్పారు. ఆయన చేసిన ఆ అంచనానే ఇప్పుడు నిజమవుతూ కనిపిస్తోంది.
అలాగే బీహార్లో పోటీ చేస్తున్న ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు—బీజేపీ, జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా—పంచ పాడవుల్లా కలిసి పోరాడుతున్నాయని అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ ఐక్యత కూడా కూటమి విజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇదే సూచించాయి. ఎక్కువ శాతం సర్వేలు నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే స్పష్టమైన ఆధిక్యం వస్తుందని ముందుగానే అంచనా వేశాయి. ఇప్పుడు ఫలితాలు కూడా ఆ దిశగానే సాగుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!