

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ త్వరలోనే హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేయనున్నట్టు సమాచారం. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇదివరకే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు కూడా భూమి కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో ఇది రెండో ఫిల్మ్ సిటీగా నిలవనుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో, ప్రభుత్వం వినోదం మరియు పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్రభుత్వం తెలిపింది. ఈ సమ్మిట్ లోనే అజయ్ దేవ్గన్ ఫిల్మ్ సిటీ ప్రాజెక్ట్ పై అధికారిక ఒప్పందం చేయనున్నారు.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (2)
అజయ్ దేవ్గన్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడం సూపర్ న్యూస్!
Exciting news! Hyderabad is about to get a world-class film city with Ajay Devgn on board.