

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి లీమా రోజ్ తన ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించారు. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.1,049 కోట్లుగా పేర్కొన్నారు. లాటరీ వ్యాపార సంస్థ అధినేత మార్టిన్ సతీమణి అయిన ఆమె ఇటీవల అన్నాడీఎంకేలో చేరి ఎన్నికల బరిలోకి దిగారు. సోమవారం నామినేషన్‌తో పాటు ఆస్తుల వివరాలను సమర్పించారు.
అఫిడవిట్ ప్రకారం, ఆమె పేరుపై 19 కిలోల బంగారం, 1,217 క్యారెట్ల వజ్రాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నాయి. చరాస్తులు రూ.139.63 కోట్లు, స్థిరాస్తులు రూ.909.94 కోట్లు ఉండగా, రూ.8.57 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ఆమె భర్త మార్టిన్ పేరుపై రూ.887.36 కోట్ల చరాస్తులు, రూ.3,262 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. కుటుంబం మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.6,000 కోట్లుగా అఫిడవిట్లో వెల్లడించారు. కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ పేరుపై రూ.655 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆరో తరగతి వరకు చదివిన ఆమెపై నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!