
.jpg&w=3840&q=75)
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిన ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదిక సంచలనం సృష్టించింది. వైసీపీ పాలనలో ఈ అక్రమం జరిగినట్లు SIT తేల్చడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ (X) ద్వారా స్పందిస్తూ, పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదం కలపకండి... కల్తీ రాజకీయం చేయకండి. తప్పు చేసిన వారిని ఇప్పటికైనా శిక్షించండి అని వ్యాఖ్యానించారు.
అయితే ఆయన ట్వీట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రతి విషయాన్ని మతం, జాతి కోణంలో మాత్రమే చూడటం సరైంది కాదు అంటూ కొందరు కౌంటర్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఇదే విషయంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. దయచేసి నిజాలను వెలికితీసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా మతం పేరుతో ప్రచారం చేయడం మానుకోండి అని అన్నారు.
ఇప్పుడు SIT తేల్చిన నివేదికతో, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు — కల్తీ నెయ్యి నిజమైతే, కల్తీ రాజకీయం ఎవరిది?











కామెంట్స్ (1)
దోషులు ఎవరో నిర్ధారించి, కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి