
గాసిప్స్

ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ మధ్య కాలంలో మొత్తం 73 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నట్లు సమాచారం. వీరిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది సభ్యులు రిటైర్ అవుతుండగా, మహారాష్ట్ర నుంచి 7 మంది, తమిళనాడు నుంచి 6 మంది, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ నుంచి తలా 5 మంది చొప్పున పదవీ విరమణ చేయనున్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి తలా 4 మంది, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి తలా 3 మంది, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా, ఝార్ఖండ్ నుంచి తలా 2 మంది సభ్యులు రిటైర్ కానున్నారు. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. ఈ పరిణామాలతో పలు రాష్ట్రాల్లో కొత్త రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!