

ప్రైమ్ వీడియో తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ఇసాకపట్నం ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఏడు ఎపిసోడ్ల యాక్షన్ థ్రిల్లర్ జూలై 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రతీకారం, అధికారం కోసం పోరాటం, కుటుంబ విభేదాలు, రాజకీయ కుట్రలు, గ్యాంగ్ వార్లు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మాధోక్ మాట్లాడుతూ, భావోద్వేగాలు, ప్రతీకారం మరియు అనూహ్య మలుపులతో నిండిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. నిర్మాతలు రాహుల్ తమడా, సందీప్ రెడ్డి బొర్రా మాట్లాడుతూ ఇది కేవలం రివెంజ్ థ్రిల్లర్ మాత్రమే కాదని, కుటుంబ బంధాలు, విశ్వాసం, రాజకీయ ఆధిపత్య పోరాటం వంటి అంశాలను భావోద్వేగంగా మిళితం చేసిన కథ అని వెల్లడించారు. తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్లతో పాటు 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో ఈ సిరీస్ 240కి పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!