

తెలుగు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’ రాబోతోంది. శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్లపై రమేష్ పుప్పాల, సూర్యకాంతి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్‌తో ఈ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ, ‘మిరపకాయ్’ సినిమా సమయంలో నిర్మాత రమేష్ పుప్పాల తనను ప్రోత్సహించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనను మళ్లీ కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. రాజా రవీంద్ర అందించిన సహకారాన్ని ప్రశంసిస్తూ, వివేక్ కూచిభొట్ల తన కుటుంబ సభ్యుడిలాంటి వారని పేర్కొన్నారు. సూర్యకాంతి నిర్మాతగా ఈ సిరీస్‌తో ముందుకు రావడం సంతోషంగా ఉందని, దర్శకుడు శశిధర్ మున్నంగి మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. నటుడు నరేష్ అగస్త్య జీ5తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ‘పసుపు కుంకుమ’, ‘పరువు’, ‘వికటకవి’ వంటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. ఈ సిరీస్‌కు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుందని దర్శకుడు శశిధర్ పేర్కొన్నారు. ‘రుద్రవనం పీఎస్’ అక్టోబర్ 30 నుంచి జీ5లో అందుబాటులోకి రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!