

ప్రతివారం ఓటీటీల్లో కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. ఈసారి కూడా ఓం శాంతి శాంతి శాంతిః, విత్ లవ్, గాంధీ టాక్స్, తన్వి ది గ్రేట్, లాలో కృష్ణ సదా సహాయతే వంటి చిత్రాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. అయితే ఎలాంటి ప్రకటనలు లేకుండా రెండు తెలుగు సినిమాలు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేశాయి. అవి ‘వంచన’ మరియు ‘దేవగుడి’. ఈ రెండు సినిమాలు ఇప్పుడు సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
‘వంచన’ ఒక కోర్ట్ రూమ్ థ్రిల్లర్. ఈ సినిమా 2024 నవంబర్ 8 న థియేటర్లలో విడుదలైంది. ఇందులో ఉమా మహేష్ హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించాడు. ఓ చర్చి ఫాదర్ హత్యకు గురవడంతో, అతడి డ్రైవర్‌ను అనుమానితుడిగా అరెస్ట్ చేస్తారు. అయితే అతడు నిర్దోషి అని నమ్మిన క్రిమినల్ లాయర్ కృష్ణ ఈ కేసును వాదిస్తాడు. ఈ కేసులో ఎదురైన సవాళ్లు, అసలు హంతకుడు ఎవరు అన్నదే కథలో ప్రధానాంశం.
మరో సినిమా ‘దేవగుడి’. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది జనవరి 30 న థియేటర్లలో విడుదలైంది. రాయలసీమ నేపథ్యంతో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కథలో వీరారెడ్డి అనే ఫ్యాక్షన్ లీడర్, తన అనుచరుడి కొడుకు ధర్మను ఊరినుంచి వెళ్లగొడతాడు. తర్వాత అతడు అనారోగ్యానికి గురై శత్రువుల చేతిలో చనిపోతాడు. అదే సమయంలో వీరారెడ్డి కూతురు శ్వేత కనిపించకుండా పోతుంది. ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? ధర్మ, శ్వేత కలుసుకున్నారా లేదా అన్నదే మిగతా కథ.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!