
సినిమాలు

‘యానిమల్’ సినిమాలో జోయా పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న త్రిప్తి డిమ్రి ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’లో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే తల్లి–కూతుళ్ల బంధం నేపథ్యంలో రూపొందుతున్న ఫ్యామిలీ డ్రామా ‘మా బెహెన్’లో కూడా కీలక పాత్రలో కనిపించనుంది.
తాజాగా విడుదలైన ‘మా బెహెన్’ ఫస్ట్ లుక్లో త్రిప్తి పూర్తిగా డీ-గ్లామర్ లుక్లో మధ్యతరగతి గృహిణిలా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. కుటుంబ సంబంధాలు, తరతరాల ఘర్షణలు, ప్రేమ భావాలను చూపించే ఈ కథపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుండగా, జూన్ 4 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!