

పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఇండిపెండెంట్ తెలుగు చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఈరోజు నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు డిజిటల్ వేదికగా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గ్రామీణ వాతావరణం, సహజమైన భావోద్వేగాలు, మట్టివాసన గల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు ప్రేమ్ కుమార్ ప్రశంసలు అందుకున్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ చిన్న సినిమాకు ప్రమోషన్స్‌లో మద్దతు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
శివానంద్, స్నేహ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కథ ఒక మారుమూల గ్రామంలోని లోకల్ కేబుల్ టీవీ చుట్టూ తిరుగుతుంది. ఆ కేబుల్ టీవీ గ్రామ ప్రజల జీవితాల్లో ఎలా మార్పులు తీసుకువచ్చిందో కామెడీ, సెంటిమెంట్ మేళవింపుతో చూపించారు. కుటుంబంతో కలిసి వీకెండ్లో సరదాగా చూసేందుకు ఈ చిత్రం మంచి ఎంపికగా నిలుస్తోంది. భారీ యాక్షన్ సినిమాల కంటే ఇలాంటి సహజమైన గ్రామీణ కథలకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!