

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చిన తర్వాత నటీనటులు చిన్నా – పెద్ద తేడా లేకుండా వెబ్‌సిరీస్‌లలో కూడా నటిస్తున్నారు. తాజాగా సముద్రఖని తొలిసారి ఓ ఓటీటీ వెబ్‌సిరీస్‌లో కనిపించబోతున్నారు. ఆ సిరీస్ పేరు ‘తడయం’ (అర్థం: క్లూ). సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ZEE5 లో ఈ నెల 27 న విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆసక్తిని పెంచింది. రోజూలాగే పాలు పోయడానికి వెళ్లిన ఓ పాలవాడు, ఒక ఇంటి వద్ద అనుమానాస్పద పరిస్థితిని గమనిస్తాడు. లోపలికి వెళ్లిన తర్వాత రక్తపుమడుగు కనిపించడంతో షాక్ అవుతాడు. ఈ సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. వరుస హత్యలను చేధించేందుకు ప్రయత్నించే ఎస్ఐ అదియమాన్ పాత్రలో సముద్రఖని కనిపిస్తున్నారు.
ట్రైలర్లో తెలుగు నటుడు నవీన్ చంద్ర వాయిస్‌తో ఒక డైలాగ్ వినిపించడం చర్చకు దారితీసింది. మరి ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర ఉన్నారా లేదా అన్నది రిలీజ్ తర్వాతే స్పష్టమవుతుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందిందని మేకర్స్ తెలిపారు. దర్శకత్వం నవీన్ కుమార్ పలనివేల్, సంగీతం విబిన్ భాస్కర్ అందించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!