

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం గొల్ల రామవ్వ ఈనెల 25 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. టైటిల్ పాత్రలో తాళ్ళూరి రామేశ్వరి నటించిన ఈ చిత్రం, స్వర్గీయ భారత ప్రధాని పి.వి. నరసింహారావు రచించిన తెలంగాణ సాయుధ పోరాట గాథకు దృశ్యరూపం. ముళ్ళపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంఛిత వీరగాథను సుచేత డ్రీమ్ వర్క్స్ మరియు వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. యువ ప్రతిభాశాలి అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా వ్యవహరించడంతో పాటు సాహిత్యం కూడా అందించారు.
ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పి.వి. నరసింహారావు తనయుడు పి.వి. ప్రభాకరరావు, మనవరాలు మరియు బారాస ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, ప్రముఖ గీత రచయితలు కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, నటుడు రాజీవ్ కనకాల, ‘రజాకార్’ దర్శకుడు యాటా సత్యనారాయణ, సీనియర్ దర్శకుడు ఉదయభాస్కర్ పాల్గొన్నారు. తన తండ్రి రాసిన గొప్ప కథల్లో ఒకటైన గొల్ల రామవ్వను అద్భుతంగా తెరకెక్కించారని వాణీదేవి ప్రశంసించారు. ఈనెల 25 నుంచి ఈటీవీ విన్లో ప్రసారం కానున్న ఈ చిత్రం తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!