

తమిళ సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెప్టెంబర్ 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలను నిలిపివేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి తీసుకెళ్లే వ్యవధికి సంబంధించిన వివాదమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో కొత్త సినిమాల నిర్మాణం, విడుదలలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
థియేటర్ యాజమానులు, డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల పాటు అక్కడే ప్రదర్శించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని వారు కోరుతున్నారు. థియేటర్-ఓటీటీ విడుదల వ్యవధిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే తమిళ చిత్ర పరిశ్రమలో కొత్త సినిమాల విడుదలలు, షూటింగ్ షెడ్యూల్స్, ఓటీటీ ప్రణాళికలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!