

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం అలమండ కోడూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిపైనే తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు స్వయం పేరుతో బ్రాండింగ్ కల్పిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాలను ప్రస్తావించిన చంద్రబాబు.. భూ హక్కులు, డీఎస్సీ నియామకాలు, గ్రూప్-1 పరీక్షలు, క్రీడా కోటా, రోడ్ల అభివృద్ధిపై మాట్లాడారు. ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమం ద్వారా ప్రతి నెలా 9వ తేదీన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. నియామకాల్లో అవినీతిని సహించబోమని స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్రను పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ఏర్పాటు చేయడంతో పాటు యువత కోసం స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నెలలో అనకాపల్లికి నీరు అందిస్తామని, రైవాడ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీటి అవసరాలను తీర్చుతామని వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!