

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం వరుస విజయాలతో మంచి జోరులో ఉన్నారు. ఇటీవల ‘చెన్నై లవ్ స్టోరీ’తో విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేస్తున్నారు. నటుడిగానే కాకుండా తొలిసారి మెగాఫోన్ పట్టుకుని ‘రియాలిటీ’ అనే విభిన్నమైన చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినీ రంగంలోకి రాకముందే పలు షార్ట్‌ఫిలిమ్స్‌కు కథలు రాసి, దర్శకత్వం వహించిన అనుభవం కిరణ్‌కు ఉంది. దీంతో తన తొలి దర్శకత్వ చిత్రాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దేవిక భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శరత్‌కుమార్, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం ‘రియాలిటీ’ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తైనట్లు సమాచారం. నవంబర్ నాటికి మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయాలని కిరణ్ అబ్బవరం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గతంలో దీపావళికి విడుదలైన ‘క’ చిత్రం తనకు మంచి విజయాన్ని అందించడంతో, అదే సెంటిమెంట్‌ను ‘రియాలిటీ’కి కూడా కొనసాగించాలని కిరణ్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే దీపావళి కానుకగా సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని దృశ్యాలు బయటకు రావడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!