

తాను చేసిన ఐటెమ్ సాంగ్స్ అన్నీ మరోసారి చేయాలనుందని నటి రమ్యకృష్ణ (Ramya Krishna) చెప్పారు. జగపతిబాబు (Jagapathi babu) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా'. ఇప్పటికే పలువురు సినీ తారలు ఈ షోకు వచ్చి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోగా, తాజాగా రమ్యకృష్ణ అతిథిగా వచ్చి సందడి చేశారు. తన డైలాగులతో పాటు, నటించిన సినిమాలకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను జీ5 విడుదల చేసింది. 'నువ్వు చేసిన వాటిలో ఏ సినిమా మరోసారి చేయాలనుందని’ జగపతిబాబు అడగ్గా.. రమ్యకృష్ణ ఆసక్తికర సమాధానమిచ్చారు. తన ఐటెమ్ సాంగ్స్ అన్నీ మళ్లీ చేయాలనుందన్నారు. 'బాహుబలి'లో శివగామిగా నటించేటప్పుడు నిజంగానే తను రాజమాతలా మారిపోయినట్లు చెప్పారు. 'నా మాటే శాసనం..' డైలాగుతో అలరించారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచి జీ5లో, ఆదివారం రాత్రి 8.30 గంటలకు జీ తెలుగులోనూ ఈ షో ప్రసారం కానుంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!