

నెట్‌ఫ్లిక్స్ తాజా గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లిష్ సినిమాల జాబితాలో సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, రవితేజ ‘ఇరుముడి’ చిత్రాలకు అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గత వారం భారతీయ చిత్రాల్లో ‘ఇరుముడి’ 3.4 మిలియన్ వ్యూస్‌తో అగ్రస్థానంలో నిలవగా, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ 2.1 మిలియన్ వ్యూస్‌తో ఐదో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు నమోదైన తాజా ర్యాంకింగ్స్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానానికి చేరగా, ‘ఇరుముడి’ 1.1 మిలియన్ వ్యూస్‌తో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
ముఖ్యంగా ‘ఇరుముడి’ ఒక్క వారంలోనే అగ్రస్థానం నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోవడం ఆసక్తికరంగా మారింది. భారత్‌లో మాత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొదటి స్థానంలో ఉండగా, ‘ఇరుముడి’ రెండో స్థానంలో కొనసాగుతోంది. వచ్చే వారం గ్లోబల్ టాప్ 10లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందా, ‘ఇరుముడి’ మళ్లీ పుంజుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!