

ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ గతేడాది ‘సౌత్ అన్‌బాండ్’ పేరుతో దక్షిణాది భాషల్లో దాదాపు 18 కొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో భాగంగా తాజాగా ‘రోస్లిన్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విడుదల తేదీపై సమాచారం వెలువడింది. ఈ సిరీస్‌కు దర్శకుడు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నటి మీనా మరియు నటుడు వినీత్ కీలక పాత్రల్లో నటించారు. ‘దృశ్యం’ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సిరీస్‌కు షోరన్నర్‌గా ఉన్నారు. ఈ కారణంగా ఈ సిరీస్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.
‘రోస్లిన్’ వెబ్ సిరీస్ ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్కు రానుందని ప్రమోషనల్ ఈవెంట్లలో వెల్లడించారు. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ట్రైలర్‌ను కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ సిరీస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రోస్లిన్ టైటిల్ పాత్రలో సంజన దిపు అనే అమ్మాయి నటించింది. మలయాళ హిట్ సినిమా ‘మూథోన్’ ద్వారా గుర్తింపు పొందిన సంజన, ఈ సిరీస్‌తో మరింత గుర్తింపు పొందనుంది. జీతూ జోసెఫ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుమేష్, ఈ సిరీస్‌తో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!