

ప్రభాస్ నటించిన హారర్ ఫాంటసీ చిత్రం ‘రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద విఫలమైన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సరైన టాక్ రాకపోవడంతో కలెక్షన్లలో కూడా పెద్దగా రాణించలేదు. అందుకే నెలలోపే డిజిటల్ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. తాజాగా, ఈ చిత్రం వచ్చే నెల 6 వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే ఇది అందుబాటులోకి వస్తుంది. హిందీ వెర్షన్ కొంత ఆలస్యంగా విడుదల కానుంది.

దర్శకుడు మారుతి రూపొందించిన ఈ పాన్ ఇండియా హారర్ ఫాంటసీ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, జరీనా వహాబ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. కథ, కంటెంట్ సరిగా అర్థం కానందున ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
కథ విషయానికి వస్తే — దేవనగర సంస్థాన ఒకప్పటి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్).. ప్రస్తుతం తన మనవడు రాజు(ప్రభాస్)తో చాలా సాధారణ జీవితం గడుపుతుంటుంది. వయసు కారణంగా ఈమెకు మతిమరుపు సమస్య ఉంటుంది. కానీ తన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తన కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా తీసుకురమ్మని మనవడికి చెబుతుంది. కానీ కనకరాజు.. రాజుని నర్సాపుర్‌లోని రాజ మహల్‌కి రప్పించుకుంటాడు. మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజు అలియాస్ రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? కనకరాజు గతమేమిటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!