
జనరల్

అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ‘లెనిన్’ విడుదలైన తొలి వీకెండ్‌లో మంచి స్పందనతో పాటు బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ షోలు నమోదు చేస్తూ ఆకట్టుకుంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణతో చిత్రబృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది.
అయితే ఇప్పుడు సినిమాకు అసలు పరీక్ష ప్రారంభమైంది. వీకెండ్ హాలిడే అడ్వాంటేజ్ ముగియడంతో సోమవారం నుంచి వసూళ్లు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది. ఇటీవల విడుదలైన కొన్ని విజయవంతమైన చిత్రాల మాదిరిగా వీక్‌డేస్‌లో కూడా ‘లెనిన్’ స్థిరమైన వసూళ్లు సాధిస్తే, ఈ సినిమా లాంగ్‌రన్‌లో భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!