
టెక్నాలజీ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్కు వచ్చిన అనంతరం కేవలం ఒక్క రోజులోనే భారత్‌లో నంబర్ 1 ట్రెండింగ్ మూవీగా నిలిచి మరోసారి తన సత్తా చాటుకుంది.
భావోద్వేగాలతో కూడిన కథ, అద్భుతమైన ప్రదర్శనలు మరియు ఆకట్టుకునే మేకింగ్‌తో ‘పెద్ది’ ఓటీటీ ప్రేక్షకుల నుంచి కూడా విశేష ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో దివ్యేందు, జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!