
జనరల్

స్వరసామ్రాజ్ఞి ఎస్. జానకి ఆకస్మిక మరణం సినీ, సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా లెజెండరీ గాయని పి.సుశీల భావోద్వేగంతో స్పందిస్తూ జానకమ్మను సంగీత ప్రపంచంలో భర్తీ చేయలేని మహోన్నత గాయని అని కొనియాడారు. దశాబ్దాల పాటు ఒకరికొకరు సమకాలీనులుగా ఉన్నప్పటికీ తమ మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పటికీ చెదరలేదని ఆమె గుర్తు చేసుకున్నారు.
తమ కెరీర్‌లో కొందరు వ్యక్తులు ఇద్దరి మధ్య అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించి మానసికంగా ఇబ్బంది పెట్టారని సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ స్నేహబంధం ఎప్పుడూ దెబ్బతినలేదని చెప్పారు. జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె ఆలపించిన వేలాది అమరగీతాల రూపంలో ఎప్పటికీ చిరంజీవిగానే నిలిచిపోతారని భావోద్వేగ నివాళి అర్పించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!