
.png&w=3840&q=75)
టాలీవుడ్ నటుడు సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా తెలుసు కదా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకులు నీరజ కోన తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదలైంది. అయితే, అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష నటించారు.
ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన తెలుసు కదా చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అప్ కమింగ్ చిత్రాల జాబితాలో నెట్ఫ్లిక్స్(Netflix) పేర్కొంది. సినిమా విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం. తెలుసు కదా మూవీని సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్తో రూపొందించారని టాక్. అయితే, బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ, ఈ సినిమా ఓటీటీ రైట్స్ సుమారుగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆపై శాటిలైట్ రైట్స్ రూ. 5 కోట్లతో పాటు మ్యూజిక్ రైట్స్ కోటి వరకు బిజినెస్ చేయడంతో కాస్త మేరకు నష్టాలు తగ్గినట్లు తెలుస్తోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!