

మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో పలు కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. రవితేజ హీరోగా నటించిన ఇరుముడి ఈ వారంలో విడుదల కానున్న ప్రధాన చిత్రాల్లో ఒకటి. తండ్రి-కూతురు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అయ్యప్ప స్వామి మాల, 41 రోజుల దీక్ష అనే అంశాలను జోడించారు. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఆసక్తిగా మారింది. దీనితో పాటు అమీర్ లోగ్, ద రెడ్ బ్యాగ్ చిత్రాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి.
మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం కొత్త కంటెంట్ సందడి చేయనుంది. ఆగస్టు 19 వరకు మొత్తం 19 సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్కు రానున్నాయి. వీటిలో దళపతి విజయ్ నటించిన జన నాయగన్, కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ, ప్యార్ ప్రేమ కల్యాణం వంటి సినిమాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. వీటితో పాటు వెల్కమ్ టూ ద జంగిల్, టాయ్ స్టోరీ 5 వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!