

ఓటీటీల్లో క్రైమ్ కథలు, హత్య రహస్య చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఇలాంటి కథలతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన హత్య రహస్య కథతో కూడిన సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ముందుగా 2023 సంవత్సరంలో ముంబై చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.
“ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా” అనే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ నెల 10వ తేదీ నుంచి జీ5 వేదికపై అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. “15 మంది స్నేహితులు, ఒక పార్టీ, ఒక రహస్య హత్య” అనే అంశంతో ఈ సినిమా కథ ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో వినయ్ పాఠక్, నీల్ భూపాలం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మించారు. ఈ సినిమాలో రణవీర్ షోరే, సౌరభ్ శుక్లా, కోయెల్ పూరీ, ఎంకే రైనా, పలోమి ఘోష్, చంద్రచూర్ రాయ్, సాదియా సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సాగర్ దేశాయ్ సంగీతం సమకూర్చారు. కాగా.. రజత్‌కపూర్ అంతకుముందు క్రౌడ్‌ఫండింగ్ ద్వారా ఆర్కే అనే మూవీని తెరకెక్కించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!