

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన కొత్త కంటెంట్‌లో ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ దుమ్ము రేపుతోంది. కొన్ని నెలల క్రితం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కావడంతో మళ్లీ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా దూసుకుపోతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండటంతో అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ ఆసక్తి చూపుతున్నారు.
కేవలం రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా, థియేటర్లలో రూ.18 కోట్లకు పైగా వసూలు చేసి మంచి లాభాలు సాధించింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో కథ పూర్తిగా రహస్యాలతో నిండిపోయి ఉంటుంది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డొమినిక్ ఇప్పుడు ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతాడు. ఒక రోజు అతని చేతికి ఒక లేడీస్ పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే ప్రయత్నంలో పూజ అనే యువతి మిస్సింగ్ కేసు బయటపడుతుంది. ఆ పర్స్‌కు పూజకు ఉన్న సంబంధం ఏమిటి? ఆమె బాయ్‌ఫ్రెండ్ కార్తీక్ పాత్ర ఏంటి? పూజ అసలు ఎలా చనిపోయింది? - అన్నీ చివరి వరకూ ఉత్కంఠ రేపే విధంగా చూపించారు.
‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ అనే ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌కు గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో మెప్పించాడు. గోకుల్ సురేష్, సుష్మిత భట్, విజಿ వెంకటేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది మరియు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ కోసం చూస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!