
గాసిప్స్

కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అన్నగారు వస్తారు’ నేరుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఇప్పటికే తమిళంలో ‘వా వాత్తియార్’ పేరుతో సంక్రాంతికి విడుదలైంది. అయితే తెలుగులో సరైన థియేటర్లు దొరకకపోవడంతో థియేట్రికల్ రిలీజ్ జరగలేదు. దీంతో తెలుగు వర్షన్‌ను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు.
నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాతో కృతి శెట్టి తమిళ చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. తమిళంలో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఓటీటీలో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఈ సినిమా ఈ నెల 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!