
రాజకీయాలు

దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన కామెడీ డ్రామా జెట్‌లీ త్వరలో OTTలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 25 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాకు OTT ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందనే ఆశాభావంతో చిత్రబృందం ఉంది. రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్, హర్ష చెముడు, కబీర్ దుహాన్ సింగ్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. కాల భైరవ సంగీతం అందించారు. ప్రస్తుతం ఇతర భాషల్లో స్ట్రీమింగ్‌పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!