

ప్రఖ్యాత నటులు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మరియు అదితీ రావు హైదరి నటించిన నిశ్శబ్ద చిత్రం గాంధీ టాక్స్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం జనవరి 30 న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది. డైలాగులు లేకుండా రూపొందించిన ఈ మూవీకి కిశోర్ దర్శకత్వం వహించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం చిత్రానికి ప్రాణం పోశాడు. ఈ చిత్రం తమిళంలో తెరకెక్కినా, డైలాగులు లేకపోవడంతో భాషతో సంబంధం లేకుండా ఎవరైనా ఆస్వాదించవచ్చు. అయితే, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని చూడాలంటే రూ. 279 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
కథ విషయానికి వస్తే - దేశంలోని ఆర్థిక పరిస్థితిలు ఆపై నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలను సున్నితంగా స్పృశిస్తూ గాంధీ టాక్స్ కథ సాగుతుంది. డబ్బు అందరి జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ మూవీలో చూపించారు. ముంబయి ధారావిలో జీవించే నిరుపేద కుర్రాడు మహాదేవ్ విష్ణు (విజయ్ సేతుపతి). చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో ముంబై నగర మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించగా రూ.50 వేలు లంచం అడుగుతారు. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న తల్లి మరోవైపు ప్రేమించిన అమ్మాయి (అదితీ రావ్ హైదరి)ని పెళ్లి చేసుకోవాలనే తపన.. అందుకోసం తనకు ఆ ఉద్యోగం చాలా అవసరం.
అయితే, ఉద్యోగం దక్కాలంటే లంచం ఇవ్వాలి.. ఆ డబ్బు కోసం నైతిక విలువల్ని పక్కకు పెట్టి ఒక తప్పుడు పని చేసేందుకు రెడీ అవుతాడు. అదే ముంబైలో బోస్మన్ (అరవింద్ స్వామి) బిగ్గెస్ట్ బిజినెస్‌మెన్‌గా రాణిస్తుంటాడు. అయితే, తన వ్యాపారంలో నష్టం రావడంతో రోడ్డున పడుతాడు. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న బోస్మన్ బయటపడేందుకు ఎలాంటి ప్లాన్ చేశాడు. మహాదేవ్ విష్ణు, బోస్మన్లు ఇద్దరూ ఎలా కలుసుకున్నారు. డబ్బు వల్ల వారిద్దరి జీవితాలు ఎలా మారిపోయాయి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!