

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా దర్శకుడు అనుదీప్ కే.వి తెరకెక్కించిన ఫన్ డ్రామా సినిమా ఫంకీ. మంచి అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన పొందలేకపోయింది. దీంతో థియేటర్లలో సాధారణ రన్‌తో ముగిసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుని, నేటి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభించింది.
థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాకపోయినా, ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. దర్శకుడు అనుదీప్ గతంలో తెరకెక్కించిన ప్రిన్స్ సినిమా కూడా థియేటర్ల తర్వాత ఓటీటీలోకి వచ్చాక కొంతమంది ప్రేక్షకులకు నచ్చింది. అదే విధంగా ఫంకీ సినిమా కూడా ఓటీటీలో మంచి స్పందన పొందుతుందా లేదా అనేది చూడాలి.
ప్రస్తుతం ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకార స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!