

ధనుష్, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మే’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను ఈరోజు (జనవరి 23) నుంచి అధికారికంగా స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా ద్వారా అఫీషియల్‌గా ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయింది.

బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది నవంబర్ 28 న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు సాధించింది. ధనుష్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తెలుగులో ‘అమర కావ్యం’ పేరుతో విడుదల కాగా, ఇప్పుడు ఆ వెర్షన్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
రూ.95 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.150 కోట్ల వరకు వసూలు చేసింది. కథ పరంగా, తన ప్రవర్తన కారణంగా సస్పెండ్ అయిన ఓ ఎయిర్‌ఫోర్స్ పైలట్, అతని జీవితాన్ని మార్చే ప్రయత్నం చేసే ఓ సైకాలజీ స్టూడెంట్ మధ్య సాగే ప్రేమకథే ఈ చిత్రం. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఐఎండీబీలో 7.5 రేటింగ్ నమోదైంది. థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!