
న్యూస్

తాజాగా రిలీజ్ అయిన తెలుగు చిత్రాల్లో మంచి టాక్ సొంతం చేసుకున్న సినిమా ‘దండోరా’ ఓ హార్డ్ హిట్టింగ్ డ్రామా. శివాజీ, నందు, నవదీప్ తదితరులు సాలిడ్ పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు మురళికాంత్ రూపొందించారు. ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించబడింది మరియు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ పొందింది. ప్రేక్షకులు మాత్రమే కాక విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ నెల 14 నుండి అందుబాటులో ఉంటుంది. ప్రైమ్ వీడియో వారు వెల్లడించిన ప్రకారం, ఈ హార్డ్ హిట్టింగ్ డ్రామా తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ చేయబడుతుంది. ఈ సినిమాని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడొచ్చు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!