

రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’ వెబ్ సిరీస్ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చింది. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉన్నా, పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ట్రైలర్ విడుదల చేయగా, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దర్శకుడు పోలూరు కృష్ణ తెరకెక్కించిన ఈ సిరీస్ ఈ నెల 27 నుంచి ‘జీ 5’ లో స్ట్రీమింగ్ కానుంది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ వంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని నిర్మించింది.
తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కేంద్రంగా చేసుకుని కథ సాగుతుంది. నటి వసంతిక ఇందులో రాజీవ్ కనకాల కూతురు స్వాతి పాత్రలో నటించింది. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు కష్టపడి ఉద్యోగంలో చేరిన కూతురు అనూహ్యంగా అదృశ్యమవుతుంది. ఈ మిస్సింగ్ కేసును ఛేదించేందుకు పోలీసు అధికారిణి పాత్రలో ఉదయభాను రంగంలోకి దిగుతుంది. స్వాతి అదృశ్యం వెనుక ఉన్న నిజాలు, ఆమెను టార్గెట్ చేసిన కారణాలు ఏమిటి అన్నది సస్పెన్స్‌గా నిలుస్తుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!