

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించిన ప్రముఖ డాక్యుమెంటరీ "సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్" మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 2017లో విడుదలైన ఈ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సచిన్ టెండూల్కర్ చిన్ననాటి నుంచి అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజంగా ఎదిగిన ప్రయాణం, అరుదైన వీడియోలు, భావోద్వేగ క్షణాలు, అలాగే భారత జట్టు 2011 ప్రపంచకప్ విజయానికి సంబంధించిన విశేష దృశ్యాలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ హిందీ వెర్షన్ పలు డిజిటల్ వేదికల్లో అందుబాటులో ఉండగా, ఇప్పుడు తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దీంతో దక్షిణాది ప్రేక్షకులు తమ మాతృభాషలో సచిన్ ప్రేరణాత్మక జీవిత గాథను వీక్షించే అవకాశం పొందనున్నారు. క్రికెట్ అభిమానులకు మాత్రమే కాకుండా యువతకు సైతం స్ఫూర్తినిచ్చే కంటెంట్‌గా ఈ డాక్యుమెంటరీ నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!