

ఈటీవీ విన్ ఓటీటీ వేదికపై ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ను ప్రశాంత్ కుమార్ దిమ్మెల తెరకెక్కించారు. ‘‘సింహం, చిరుత లాంటి మృగాలు ఎన్ని చేసినా జింక బెదరలేదు.. ఎందుకంటే అది జింకే కాదు’’ అనే డైలాగ్‌తో ఈ సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, మేఘలేఖ కీలక పాత్రల్లో మెప్పించారు.
ఇప్పుడు ఈ సిరీస్‌కు కొనసాగింపుగా సీజన్ 2 రాబోతున్నట్లు ETV Win అధికారికంగా ప్రకటించింది. ‘‘మౌనంలోనే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. సీజన్ 2లో అన్ని సమాధానాలు లభిస్తాయి. అన్ని ప్రశ్నలు ఒకే నిజానికి దారి తీస్తాయి. చంద్రిక ఎక్కడ?’’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌తో విడుదల తేదీని వెల్లడించింది. ‘కానిస్టేబుల్ కనకం సీజన్ 2’ జనవరి 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సీజన్ 1లో మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో ఈ ప్రకటనతో అంచనాలు మరింత పెరిగాయి.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!