

మంథని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు, ఫొటోతో పాటు సంబంధిత శాఖ మంత్రుల పేర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు లేఖ రాశారు. ఈ లేఖ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నిబంధనలు పాటించాలని ఎంపీ తన లేఖలో కోరారు.
మంథనిలో ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవనాన్ని ఇటీవల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. అయితే ఆ కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రుల పేర్లు లేకపోవడంపై వివాదం తలెత్తింది. దీనిపై స్పందించిన వంశీకృష్ణ ప్రజాస్వామ్య విలువలు, ప్రభుత్వ ప్రోటోకాల్‌ను గౌరవించాలని సీఎస్‌ను కోరారు. నిబంధనల ప్రకారం శిలాఫలకంపై సీఎం పేరు, ఫొటోతో పాటు సంబంధిత మంత్రుల పేర్లను వెంటనే చేర్చి తప్పిదాన్ని సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీకి చెందిన ఎంపీనే ఈ అంశంపై లేఖ రాయడంతో మంథని రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!