

యంగ్ హీరో రోషన్ నటించిన సినిమా ‘ఛాంపియన్’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోషన్‌కు ఇది తొలి సినిమా. డిసెంబర్ 25 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించగా, ‘మహానటి’, ‘సీతారామం’ వంటి హిట్ సినిమాల తర్వాత స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
‘ఛాంపియన్’ సినిమా జనవరి 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. సుమారు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.17 కోట్ల వసూలు మాత్రమే చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో రోషన్ సరసన అనస్వర రాజన్ నటించగా, సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో కనిపించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
కథ విషయానికి వస్తే, ఈ సినిమా కథ 1947 – 48 కాలంలో సాగుతుంది. సికింద్రాబాద్‌లోని ఓ బేకరీలో పని చేసే మైఖేల్‌కు ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టం. ఈ ఆట ద్వారానే ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ స్థిరపడాలని అతని ఆశ. ఒకసారి ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం వచ్చినా, తండ్రి చేసిన తప్పిదం వల్ల అది సాధ్యపడదు. దొంగమార్గంలో ఇంగ్లాండ్ వెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో, ఆయుధాలను తరలించే పనిలో ఇరుక్కొని పోలీసుల నుంచి తప్పించుకుంటూ బైరాన్‌పల్లి అనే గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ చంద్రకళతో పరిచయం ఏర్పడుతుంది. నిజాం పాలకులపై గ్రామస్తులు చేసిన తిరుగుబాటు మైఖేల్‌ను ఎలా మార్చింది? పోలీస్ అధికారి బాబు దేశ్ముఖ్తో అతని గొడవ ఏమిటి? బైరాన్‌పల్లి ప్రజల కోసం మైఖేల్ చేసిన త్యాగమేంటి? అన్నదే మిగతా కథ.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!