
ఓటీటీ

కొరియన్ డ్రామా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అజూర్ స్ప్రింగ్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెడ్ వెల్వెట్ సభ్యురాలు యేరి ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సిరీస్‌పై భారతీయ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఈ సిరీస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కొరియాలో ప్రసార సమయాన్ని బట్టి భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సిరీస్ స్ట్రీమింగ్కు వస్తుండగా, భవిష్యత్తులో తెలుగు, హిందీ డబ్బింగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అధికారిక స్ట్రీమింగ్ వివరాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!