Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మూడు నెలల తర్వాత 'అవతార్ 3' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

10:01 AM, 25 మార్చి, 2026
మూడు నెలల తర్వాత 'అవతార్ 3' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

'అవతార్' సినిమాల గురించి సినీ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు మూడు భాగాలు విడుదల కాగా, ఇంకా రెండు భాగాలు రావాల్సి ఉన్నాయి. 2009లో వచ్చిన మొదటి సినిమా భారీ విజయం సాధించింది. 2022లో వచ్చిన 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' కూడా మంచి స్పందన పొందింది. గతేడాది డిసెంబర్ 19న విడుదలైన మూడో భాగం'అవతార్ ఫైర్ అండ్ యాష్' మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.12 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఇప్పుడు థియేటర్లలో విడుదలైన దాదాపు మూడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 31 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ మరియు ఆపిల్ టీవీ ప్లస్ లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇది ప్రస్తుతం ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక భారతదేశంలో డిజిటల్ హక్కులు ఉన్న హాట్‌స్టార్‌లో వచ్చే నెల లేదా మే నెలలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని సమాచారం.

'అవతార్ 3' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకుని కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్‌పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్‪కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంధన సరఫరాపై భయం అవసరం లేదు - కేంద్రం  హామీ

ఇంధన సరఫరాపై భయం అవసరం లేదు - కేంద్రం హామీ

నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

యుద్ధ ప్రభావం…ఏసీ డిమాండ్‌పై దెబ్బ

యుద్ధ ప్రభావం…ఏసీ డిమాండ్‌పై దెబ్బ

ఓటీటీలోకి ‘విష్ణు విన్యాసం’

ఓటీటీలోకి ‘విష్ణు విన్యాసం’

లెబనాన్‌లో మిసైల్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న జర్నలిస్టు

లెబనాన్‌లో మిసైల్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న జర్నలిస్టు

భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష

భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష

దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి రాష్ట్ర పండుగగా గుర్తింపు.. జీఓ జారీ!

దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి రాష్ట్ర పండుగగా గుర్తింపు.. జీఓ జారీ!

10 కీలక హామీలతో తృణమూల్ మేనిఫెస్టో విడుదల చేసిన మమతా బెనర్జీ

10 కీలక హామీలతో తృణమూల్ మేనిఫెస్టో విడుదల చేసిన మమతా బెనర్జీ

డ్రగ్స్ కేసులో అరెస్ట్

డ్రగ్స్ కేసులో అరెస్ట్

మెటా నిర్ణయం వెనుక అసలు కారణం?

మెటా నిర్ణయం వెనుక అసలు కారణం?

ట్యాగ్లు
అవతార్ 3అవతార్ ఫైర్ అండ్ యాష్జేమ్స్ కామెరూన్ఓటీటీ విడుదలఅమెజాన్ ప్రైమ్ వీడియోఆపిల్ టీవీ ప్లస్డిస్నీ హాట్ స్టార్హాలీవుడ్ సినిమాలుస్ట్రీమింగ్ అప్‌డేట్అవతార్ సిరీస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవా కట్టా క్లారిటీ!
సినిమాలు

పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవా కట్టా క్లారిటీ!

దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్
సినిమాలు

దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!
న్యూస్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!

తెలంగాణలో  పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...
న్యూస్

తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!
న్యూస్

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!
క్రీడలు

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ
న్యూస్

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు
రాజకీయాలు

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం
న్యూస్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్
రాజకీయాలు

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!