

అవతార్ ఫైర్ అండ్ యాష్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అవతార్ 3 : ఫైర్ అండ్ యాష్’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. 2025 డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం జూన్ 24 నుంచి డిస్నీ ప్లస్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ తర్వాత జేక్ సల్లీ కుటుంబం ఎదుర్కొనే భావోద్వేగాలు, కొత్త యుద్ధాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
జేక్ సల్లీ, నేతిరి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవడానికి కల్నల్ క్వారిచ్ మళ్లీ రంగంలోకి దిగుతాడు. అతడికి అగ్ని తెగ నాయకురాలు వరంగ్ మద్దతు ఇస్తుంది. ఈవా దేవతపై కోపంతో రగిలిపోతున్న వరంగ్, ఆధునిక ఆయుధాలతో పండోరాపై దాడికి సిద్ధమవుతుంది. ఆర్డీఏ బలగాల సహాయంతో పండోరాలోని తెగలపై యుద్ధం మొదలవుతుంది. అద్భుతమైన విజువల్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలతో ఈ చిత్రం ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని అందించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!