
ఓటీటీ

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ‘రాకాస’ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ నెల 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హారర్ కామెడీ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సంతోష్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించారు.
సుమారు 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రాకాస’ థియేటర్లలో మంచి వసూళ్లు సాధించగా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో కూడా ట్రెండ్ అవుతోంది. నాన్ ఇంగ్లీష్ మూవీస్ విభాగంలో 12 లక్షల వ్యూస్‌తో టాప్ 10లో చోటు సంపాదించింది. హారర్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ఆసక్తికర కథనం, నటీనటుల ప్రదర్శన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!