

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయడంతో అదిరిపోయే హైప్ క్రియేట్ అయింది. కొన్ని కారణాల వల్ల నిర్ణయించిన తేదీకి కాస్త ఆలస్యంగా థియేటర్లలో విడుదలైంది.
సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగింది. ముఖ్యంగా బాలయ్య నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా నేటి(జనవరి 9) నుంచి అందుబాటులోకి వచ్చింది. తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
సంయుక్త, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!