

ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ పొందిన ఏఐ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ కానుంది. టెక్నాలజీ, సస్పెన్స్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ సిరీస్ థ్రిల్లర్ అభిమానులను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. నేరాలను ముందుగానే గుర్తించే ఓ ప్రత్యేక మెషీన్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఒక బిలియనీర్, మాజీ సీఐఏ ఏజెంట్ కలిసి ప్రమాదాలను అడ్డుకునే విధానం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది.
మొత్తం ఐదు సీజన్లు, 103 ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్‌లో యాక్షన్ సన్నివేశాలు, ట్విస్టులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రైవసీ, సర్వైలెన్స్, డిజిటల్ నియంత్రణ వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ఈ షో, ఇప్పుడు భారతీయ ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోనుంది. వీకెండ్ బింజ్ వాచ్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!