

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గురించి అందరికీ తెలుసు. ఆయన కుమారుడు రాజీవ్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. 2021లో చిరంజీవి చేతుల మీదగా రాజీవ్ నటించిన ఓ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. కానీ ఆ సినిమా చాలా కాలంగా థియేటర్లలో విడుదల కావడం కుదరలేదు.
ఆ సినిమా పేరు ‘11:11’. ఇది మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తెరకెక్కింది. ఆర్థిక సమస్యల కారణంగానో, ఇతర కారణాలవల్లనో గత రెండు నుంచి మూడు సంవత్సరాలుగా ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. చివరికి ఎలాంటి ప్రచారం లేకుండా ఈ చిత్రాన్ని నేరుగా ఆహా ఓటీటీలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే ఇతర చిత్రాల విషయానికి వస్తే, రామ్ నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’, కీర్తి సురేశ్ నటించిన ‘రివాల్వర్ రీటా’ చిత్రాలు వరుసగా బుధవారం, గురువారం స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే ‘ఏక్ దివానే కీ దివానియత్’, ‘మిడిల్ క్లాస్’ సినిమాలు కూడా డిజిటల్‌గా విడుదల కానున్నాయి. మరోవైపు, తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2’ ఈ శుక్రవారం ఓటీటీలోకి రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!