
గాసిప్స్

టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. చివరకు ఆ హిట్ ఆయనకు ‘శంబాల’ (Shambala) సినిమా రూపంలో దక్కింది. గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
‘శంబాల’ సినిమా ఓటీటీ హక్కులను తెలుగు ప్లాట్‌ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా ఈరోజు నుంచే స్ట్రీమింగ్‌లో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఆహా గోల్డ్ యూజర్లకు మాత్రమే వీక్షణ అవకాశం ఉంది. రేపటి నుంచి రెగ్యులర్ సబ్స్క్రైబర్లు కూడా ఈ సినిమాను చూడవచ్చు. మీరు గోల్డ్ యూజర్ అయితే, ఈ థ్రిల్లర్‌ను ఇప్పుడే ఎంజాయ్ చేయవచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!