

జూన్ 14 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానున్న కథాధారిత చిత్రం “ఇల్లు” ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. మనోహర ఆర్ట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రోహిత్, శశి దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, అనీష్ కురువిల్ల ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.

ప్రమోషన్ కార్యక్రమంలో గెస్ట్‌గా పాల్గొన్న రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ, “సాధారణ కథను అందంగా చెప్పడం పెద్ద సవాలు. ఇల్లు సినిమా ప్రేక్షకులకు మనసుకు ప్రశాంతతను ఇస్తుంది” అని తెలిపారు. నటీనటులు బిందు చంద్రమౌళి, అనీష్ కురువిల్ల ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు.
నిర్మాత కిషోర్ మారిశెట్టి మాట్లాడుతూ, రామానాయుడు, రామోజీ రావు వంటి మహానుభావులే తనకు ప్రేరణ అని, వారి స్ఫూర్తితోనే ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టానని తెలిపారు. దర్శకుల క్రియేటివ్ విజన్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!