
గాసిప్స్

ప్రసిద్ధ యూట్యూబర్ నా అన్వేష్‌కు చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను యాజమాన్యం నిషేధించినట్లు సమాచారం. సుమారు 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఈ అకౌంట్‌పై గతంలో భారత్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం నెలకొంది. ఈ చర్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి అకౌంట్ వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడనే ఆరోపణలతో అకౌంట్‌ను తొలగించాలని పోలీసులు కోరినట్లు సమాచారం. అవసరమైన వివరాలు అందిన వెంటనే సీసీఎస్ పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!