
సినిమాలు

అమెరికా ప్రభుత్వం వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1, పీ-1, టీఎన్ వంటి వీసాలకు సంబంధించిన ఫామ్ I-129 ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు ఇప్పటివరకు ఉన్న 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెంచారు. అలాగే, ఫామ్ I-140 ఇమ్మిగ్రెంట్ పిటిషన్లకు కూడా ఇదే ఫీజును వర్తింపజేస్తున్నారు.
ఇతర దరఖాస్తుల విషయంలో కూడా ఫీజులు పెరిగాయి. ఫామ్ I-765, I-129 అప్లికేషన్ల ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెంచారు. ఫామ్ I-539 అప్లికేషన్ల ఫీజును 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లుగా నిర్ణయించారు. ఈ మార్పులపై యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!