
క్రీడలు

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక హెచ్చరిక జారీ చేసింది. హార్ముజ్ జలసంధి మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు, జీవన వ్యయాలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మార్గం ద్వారా ప్రపంచంలోని కీలక చమురు రవాణా జరగడంతో పాటు అనేక దేశాల వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
హార్ముజ్ జలసంధి మీదుగా నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలకు అంతరాయం కలిగితే అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర దెబ్బ తగులుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. దీనివల్ల ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్సీటీఏడీ) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!